జెడ్పీటీసీ కనబడుటలేదు.. పోలీస్టేషన్‌లో ఫిర్యాదు

దిశ, కల్వకుర్తి: కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్ ప్రసాద్ కనబడటం లేదని శనివారం యూత్ కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన భరత్ ప్రసాద్ ఏనాడు ప్రజా సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అనిల్ గౌడ్ విమర్శించారు. కరోనా విపత్కర పరిస్థితితుల్లో మండల ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల బాగోగులు చూడాల్సిన జెడ్పీటీసీ అజ్ఞాతంలోకి వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. మండలంలో ధాన్యం […]

Update: 2021-06-19 05:41 GMT

దిశ, కల్వకుర్తి: కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్ ప్రసాద్ కనబడటం లేదని శనివారం యూత్ కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన భరత్ ప్రసాద్ ఏనాడు ప్రజా సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అనిల్ గౌడ్ విమర్శించారు. కరోనా విపత్కర పరిస్థితితుల్లో మండల ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల బాగోగులు చూడాల్సిన జెడ్పీటీసీ అజ్ఞాతంలోకి వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. మండలంలో ధాన్యం కొనుగోళ్లలో రైతులు పడుతున్న ఇబ్బందులపై స్పందించకపోవడం, కనీసం రైతు సమస్యలపై మాట్లాడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.

హైదరాబాద్‌లో ఉంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తప్పా.. ప్రజల కంటికి కనిపించే పరిస్థితి లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాని జెడ్పీటీసీని ప్రశ్నించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, గ్రామాల్లో పర్యటించి సమస్యలను పరిష్కారం దిశగా కృషి చేయాలని యువజన కాంగ్రెస్ నాయకులు హితవు పలికారు.

Tags:    

Similar News