అధికారంలో ఉన్నారని దాడులు చేస్తే ఊరుకోం : కాంగ్రెస్ నేతలు ఫైర్
దిశ, ముధోల్ : అధికారంలో ఉన్నామని ప్రత్యర్థి సర్పంచ్‌లను తరచూ వేధిస్తూ గ్రామాల అభివృద్ధికి ఆటంకంగా మారితే ఉరుకునే ప్రసక్తే లేదని నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు పవర్ రామారావు పటేల్ అన్నారు. గురువారం భైంసా పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామారావు మాట్లాడుతూ.. ఈలేగాం గ్రామ సర్పంచ్ ముత్యంపై దాడికి పాల్పడటం సరికాదన్నారు. కేంద్రం నిధులతో గ్రామాలు అభివృద్ధి చేస్తుంటే టీఆర్ఎస్ నాయకులకు వచ్చిన నష్టమేమంటని ప్రశ్నించారు. తరచూ కలెక్టర్‌కు ఫిర్యాదు […]
దిశ, ముధోల్ : అధికారంలో ఉన్నామని ప్రత్యర్థి సర్పంచ్‌లను తరచూ వేధిస్తూ గ్రామాల అభివృద్ధికి ఆటంకంగా మారితే ఉరుకునే ప్రసక్తే లేదని నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు పవర్ రామారావు పటేల్ అన్నారు. గురువారం భైంసా పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామారావు మాట్లాడుతూ.. ఈలేగాం గ్రామ సర్పంచ్ ముత్యంపై దాడికి పాల్పడటం సరికాదన్నారు.
కేంద్రం నిధులతో గ్రామాలు అభివృద్ధి చేస్తుంటే టీఆర్ఎస్ నాయకులకు వచ్చిన నష్టమేమంటని ప్రశ్నించారు. తరచూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం, బిల్లులు రాకుండా అడ్డుకోవడం ఇలాంటి వేధింపులకు తాము సరైన సమాధానం త్వరలోనే చెబుతామన్నారు. సర్పంచ్‌పై దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్య తీసుకోని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరుఫున ఎమ్మెల్యే ఇంటిని, కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రామారావుతో పాటు కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు.