పాలకుల నిజస్వరూపం బట్టబయలైంది
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా విషయంలో నిర్లక్ష్యం వహించిన తెలంగాణ సర్కార్ పనితీరును హైకోర్టు మరోసారి ఎండగట్టిందని కాంగ్రెస్ నేత విజయశాంతి పేర్కొన్నారు. ఫేస్‌బుక్ వేదికగా బుధవారం ఆమె ప్రభుత్వంపై మండిపడ్డారు. కోర్టు వ్యాఖ్యలతో పాలకుల నిజ స్వరూపం బట్టబయలైందని, కోర్టు వ్యాఖ్యలకు బదులివ్వలేక సర్కారు నీళ్లు నమలాల్సి వచ్చిందని విమర్శించారు. అధికార యంత్రాంగాన్ని ఇంతగా మందలిస్తుంటే బయటకు మాత్రం మెచ్చుకున్నట్టు చెప్పుకుంటున్నారని అన్నారు. కరోనా చికిత్సను అందించడంలో ఐసీఎంఆర్ నిబంధనలను గాలికి వదిలేశారని, ఇది చాలక మరోవైపు […]
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా విషయంలో నిర్లక్ష్యం వహించిన తెలంగాణ సర్కార్ పనితీరును హైకోర్టు మరోసారి ఎండగట్టిందని కాంగ్రెస్ నేత విజయశాంతి పేర్కొన్నారు. ఫేస్‌బుక్ వేదికగా బుధవారం ఆమె ప్రభుత్వంపై మండిపడ్డారు. కోర్టు వ్యాఖ్యలతో పాలకుల నిజ స్వరూపం బట్టబయలైందని, కోర్టు వ్యాఖ్యలకు బదులివ్వలేక సర్కారు నీళ్లు నమలాల్సి వచ్చిందని విమర్శించారు. అధికార యంత్రాంగాన్ని ఇంతగా మందలిస్తుంటే బయటకు మాత్రం మెచ్చుకున్నట్టు చెప్పుకుంటున్నారని అన్నారు. కరోనా చికిత్సను అందించడంలో ఐసీఎంఆర్ నిబంధనలను గాలికి వదిలేశారని, ఇది చాలక మరోవైపు ప్రయివేట్ నర్సుల దుస్థితిపై హెచ్చార్సీ నుంచి ఉన్నతాధికారులు నోటీసులు అందుకున్నారన్నారు.