దళితున్ని ముఖ్యమంత్రి చేసే దమ్ము కేసీఆర్‌కు ఉందా : ఠాగూర్
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మనువాది అని, అందుకే రాష్ట్రంలోని దళితుల పట్ల వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. అంతేగాకుండా.. ప్రతిపక్ష నేతగా దళిత వ్యక్తిని చూడలేకపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కేబినెట్‌లోనూ ఎస్సీ శాఖను చివరి వరుసలో ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణ పురపాలక శాఖను దళితులకు ఇచ్చే దమ్ము టీఆర్ఎస్ సర్కార్‌కు ఉందా? అని […]
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మనువాది అని, అందుకే రాష్ట్రంలోని దళితుల పట్ల వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. అంతేగాకుండా.. ప్రతిపక్ష నేతగా దళిత వ్యక్తిని చూడలేకపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కేబినెట్‌లోనూ ఎస్సీ శాఖను చివరి వరుసలో ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణ పురపాలక శాఖను దళితులకు ఇచ్చే దమ్ము టీఆర్ఎస్ సర్కార్‌కు ఉందా? అని ప్రశ్నించారు. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. దళిత సీఎంను చేస్తాననే దమ్ము కేసీఆర్‌కు ఉందా అని అడిగారు.