కేసీఆర్‌కు సవాల్ విసిరిన ఉత్తమ్ సతీమణి

దిశ, నేరేడుచర్ల: రాష్ట్రంలో వర్షాలు కురిసి తడిసిన రైతుల ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి డిమాండ్ చేసింది. ఆదివారం పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్లే ధాన్యం తడిసి ముద్దయ్యిందని, ఇది ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని […]

Update: 2021-11-21 03:11 GMT

దిశ, నేరేడుచర్ల: రాష్ట్రంలో వర్షాలు కురిసి తడిసిన రైతుల ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి డిమాండ్ చేసింది. ఆదివారం పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్లే ధాన్యం తడిసి ముద్దయ్యిందని, ఇది ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆమె తీవ్రస్థాయిలో మండిపడింది. రైతుల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రైతులకు ఎకరానికి రూ. 25 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేసింది. రైతులు యాసంగి వరి పంటలు వేయాలన్నా సందిగ్ధంలో ఉన్నారని.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని బూచీగా చూపి తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుందని ఆమె పేర్కొన్నది.

రైతు చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, రైతు సంఘాలు.. ధర్నాలు చేస్తుంటే ఢిల్లీలో బీజేపికి వంత పాడిన కేసీఆర్.. నేడు మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ ఆమె ఎద్దేవా చేసింది. కేంద్రంతో చర్చలు అంటూ ఢిల్లీకి వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశ ప్రజల నడ్డివిరిచే విధంగా ఉన్న నూతన విద్యుత్ చట్టాలను, సవరించిన కార్మిక చట్టాలను వెనక్కి తీసుకోవాలని బీజేపీని డిమాండ్ చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలంటూ సవాల్ విసిరింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యవసాయ శాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చి నష్టపోయిన రైతాంగాన్ని గుర్తించి, వారికి నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో అర్హులైన గిరిజనులందరికీ పట్టాలివ్వాలని కూడా ఆమె డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో పాలకవీడు, నేరేడుచర్ల మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుబ్బారావు, కొణతం చిన్న వెంకటరెడ్డి, ఎంపీపీ భూక్యా గోపాల్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జనార్ధనాచారి, నరసింహారావు, వైస్ ఎంపీపీ పిన్నెల్లి ఉపేందర్ రావు, శేషు, అందె రాజు, మండల కిసాన్ సెల్ నాయకులు రామారావు, మండల నాయకుడు నిమ్మ నాయక్, కీత శ్రీను, భోగాల రామ నరసింహారెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు.

Tags:    

Similar News