అసెంబ్లీలో కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం

దిశ, చండీగఢ్: హర్యానా అసెంబ్లీలో మనోహర్ లాల్ ఖట్టార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని అసెంబ్లీ స్పీకర్ గ్యాన్ చాంద్ గుప్తా ఆమోదించారు. మార్చి 10న అవిశ్వాస తీర్మానంపై చర్చించనున్నట్టు వెల్లడించారు. హర్యానా అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు శుక్రవారం మొదలయ్యాయి. తొలి రోజే ప్రతిపక్ష కాంగ్రెస్, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా సహా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. […]

Update: 2021-03-05 21:00 GMT

దిశ, చండీగఢ్: హర్యానా అసెంబ్లీలో మనోహర్ లాల్ ఖట్టార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని అసెంబ్లీ స్పీకర్ గ్యాన్ చాంద్ గుప్తా ఆమోదించారు. మార్చి 10న అవిశ్వాస తీర్మానంపై చర్చించనున్నట్టు వెల్లడించారు. హర్యానా అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు శుక్రవారం మొదలయ్యాయి. తొలి రోజే ప్రతిపక్ష కాంగ్రెస్, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా సహా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ స్పందిస్తూ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని అన్నారు. కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలాన్ని చూసుకోవడానికే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారని వ్యంగ్యంగా స్పందించారు.

Tags:    

Similar News