మంత్రి కొప్పులకు మరోషాక్.. ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

దిశ, పెద్దపల్లి: రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆడియో లీక్ వ్యవహారం మరింత ముదురుతోంది. ఎంపీటీసీలను ప్రలోభ పెడుతున్నారంటూ బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‎కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓ ఎంపీటీసీతో మంత్రి కొప్పుల మాట్లాడిన ఆడియో లీకైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎలక్షన్స్‎లో ఎంపీటీసీలను డబ్బులతో కొనే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. డబ్బు ఆశ చూపిన విషయంపై మాట్లాడినట్టు ఆడియోలో ఉందని జగిత్యాల […]

Update: 2021-12-01 10:22 GMT

దిశ, పెద్దపల్లి: రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆడియో లీక్ వ్యవహారం మరింత ముదురుతోంది. ఎంపీటీసీలను ప్రలోభ పెడుతున్నారంటూ బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‎కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓ ఎంపీటీసీతో మంత్రి కొప్పుల మాట్లాడిన ఆడియో లీకైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎలక్షన్స్‎లో ఎంపీటీసీలను డబ్బులతో కొనే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. డబ్బు ఆశ చూపిన విషయంపై మాట్లాడినట్టు ఆడియోలో ఉందని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్‌ గోయల్‌కు ఫిర్యాదు చేశారు. తక్షణమే మంత్రి వ్యాఖ్యలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags:    

Similar News