ఫేస్‌బుక్ సీఈవోకు కాంగ్రెస్ లేఖ..

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలోని సామాజిక మాధ్యమాలను బీజేపీ సెంట్రల్ సర్కార్ ఆపరేట్ చేస్తోందని గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో బీజేపీ అనుకూల పోస్టులు మాత్రమే వచ్చేలా చేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్ సీఈవో మార్క్‌ జుకర్ బర్గ్‌కు ఆ పార్టీ లేఖ రాసింది. భారత్‌లో ఫేస్‌బుక్ కార్యకలాపాలపై వచ్చిన ఆరోపణల దర్యాప్తునకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. వాట్సాప్‌ను బీజేపీ పరోక్షంగా […]

Update: 2020-08-29 06:40 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలోని సామాజిక మాధ్యమాలను బీజేపీ సెంట్రల్ సర్కార్ ఆపరేట్ చేస్తోందని గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో బీజేపీ అనుకూల పోస్టులు మాత్రమే వచ్చేలా చేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్ సీఈవో మార్క్‌ జుకర్ బర్గ్‌కు ఆ పార్టీ లేఖ రాసింది.

భారత్‌లో ఫేస్‌బుక్ కార్యకలాపాలపై వచ్చిన ఆరోపణల దర్యాప్తునకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. వాట్సాప్‌ను బీజేపీ పరోక్షంగా నియంత్రిస్తుందని విదేశీ మీడియా ప్రచురించిన కథనంపై స్పందించాలని ఆ లేఖలో పేర్కొన్నది. కాగా, దీనిపై ఫేస్‌బుక్ సీఈవో ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News