అధికార పార్టీని కాదనలేక, ఈటల మీద మనసు చంపుకోలేక.. ఏ గట్టుకుంటారో..?
దిశ, హుజురాబాద్: ఆ గట్టునుంటావా ఓటరన్న.. ఈ గట్టుకొస్తావా.. ఆ గట్టుకేమో టీఆర్ఎస్ పార్టీ ఉంది.. ఈ గట్టుకేమో కమలం పువ్వు ఉంది..! ఆర్టికల్‌లో రంగస్థలం మూవీ టైటిల్ సాంగ్ ఏంటీ అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది నిజమే.. హుజురాబాద్ శాసనసభకు జరుగనున్న ఉప ఎన్నికలో ఈ వింత పరిస్థితి నెలకొంది. ఇన్నాళ్లు ఈటల వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్‌లో చేరుతుండగా.. ఇతర పార్టీల్లోని కార్యకర్తలు, యువకులు బీజేపీలో చేరుతున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల […]
దిశ, హుజురాబాద్: ఆ గట్టునుంటావా ఓటరన్న.. ఈ గట్టుకొస్తావా.. ఆ గట్టుకేమో టీఆర్ఎస్ పార్టీ ఉంది.. ఈ గట్టుకేమో కమలం పువ్వు ఉంది..! ఆర్టికల్‌లో రంగస్థలం మూవీ టైటిల్ సాంగ్ ఏంటీ అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది నిజమే.. హుజురాబాద్ శాసనసభకు జరుగనున్న ఉప ఎన్నికలో ఈ వింత పరిస్థితి నెలకొంది.
ఇన్నాళ్లు ఈటల వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్‌లో చేరుతుండగా.. ఇతర పార్టీల్లోని కార్యకర్తలు, యువకులు బీజేపీలో చేరుతున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వర్సెస్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పోటీ కాస్తా.. కేసీఆర్ వర్సెస్ ఈటలగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో ఇరు పార్టీలకు ఈ ఎన్నిక చావో-రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, గెల్లు గెలుపు బాధ్యతను ట్రబుల్ షూటర్‌గా పేరున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు భుజస్కంధాలపై వేసుకుని హుజురాబాద్‌కే మకాం మార్చారు.. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని పార్టీలో చేరికలు ముమ్మరం చేశారు. ఓ వైపు హరీష్ రావు మరోవైపు ఈటల వ్యూహాలకు పదును పెడుతుండటంతో ఏ గట్టునుండాలో తెలియక అనేక మంది కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఓ వైపు అధికార పార్టీని కాదనలేక, మరో వైపు ఈటల మీద మనసు చంపుకోలేక మదనపడుతున్న కార్యకర్తల సంఖ్య.. అంచనాలకు అందని స్థాయిలో ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఉప ఎన్నిక అధికార పార్టీకి సవాల్ కాగా.. ఈటలకు చావోరేవో తేల్చుకునే గడ్డు పరిస్థితి. అయితే గెల్లు గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ నేతలు సీరియస్‌గా ప్రచారం చేస్తుండగా ఆ స్థాయిలో బీజేపీ పెద్దలు పని చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఓట్లు వేసేనాటికి ఏ ఓటర్ ఏ గట్టుకుంటాడో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.