రసాభాసగా అన్నాడీఎంకే సమావేశం…

దిశ, వెబ్‌డెస్క్: అన్నా డీఎంకే సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సీఎం అభ్యర్థిత్వం విషయంలో అగ్రనేతలు పన్నీరు సెల్వం, పళనీ స్వామిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సీఎం అభ్యర్థి నేనేంటేనేను అని ఇరువురు పరస్పరం వాగ్వాదానికి దిగారు. తాత్కాలికంగా డిప్యూటీ సీఎంగా ఉండటానికి తాను ఒప్పుకున్నాననీ పన్నీరు సెల్వం అన్నారు. ఇకపై అలా కుదరదని ఆయన తేల్చి చెప్పారు. కాగా తానే సీఎం అభ్యర్థిగా ఉంటానని పళనీ స్వామి తెగేసి చెప్పారు. దీంతో పార్టీ కార్యకర్తలు […]

Update: 2020-09-28 06:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: అన్నా డీఎంకే సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సీఎం అభ్యర్థిత్వం విషయంలో అగ్రనేతలు పన్నీరు సెల్వం, పళనీ స్వామిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సీఎం అభ్యర్థి నేనేంటేనేను అని ఇరువురు పరస్పరం వాగ్వాదానికి దిగారు. తాత్కాలికంగా డిప్యూటీ సీఎంగా ఉండటానికి తాను ఒప్పుకున్నాననీ పన్నీరు సెల్వం అన్నారు. ఇకపై అలా కుదరదని ఆయన తేల్చి చెప్పారు. కాగా తానే సీఎం అభ్యర్థిగా ఉంటానని పళనీ స్వామి తెగేసి చెప్పారు. దీంతో పార్టీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయారు. సభ రసాభాసగా మారడంతో పార్టీ చీఫ్, సీఎం అభ్యర్థులు ఎవరన్న విషయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశారు.

Tags:    

Similar News