నిర్మల్ బస్ డిపో‌లో తీవ్ర ఉద్రిక్తత

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణలోని ఖాళీ స్థలంలో మున్సిపల్ చైర్మన్, అధికారులు చేపట్టిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఎలాంటి అనుమతులు లేకుండా పనులు ప్రారంభించారని.. డిపో మేనేజర్‌తో పాటు ఆర్టీసీ కార్మికులు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆర్టీసీ ఎండీ అనుమతి తీసుకున్నాకే పనులు ప్రారంభించాలని మేనేజర్ చెప్పడంతో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అతనిపై బెదిరింపులకు పాల్పడ్డారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, […]

Update: 2021-08-06 06:01 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణలోని ఖాళీ స్థలంలో మున్సిపల్ చైర్మన్, అధికారులు చేపట్టిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఎలాంటి అనుమతులు లేకుండా పనులు ప్రారంభించారని.. డిపో మేనేజర్‌తో పాటు ఆర్టీసీ కార్మికులు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆర్టీసీ ఎండీ అనుమతి తీసుకున్నాకే పనులు ప్రారంభించాలని మేనేజర్ చెప్పడంతో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అతనిపై బెదిరింపులకు పాల్పడ్డారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్‌లు కలిసి ఇటీవల షాపింగ్ పనులకు శంకస్థాపన చేశారని మున్సిపల్ చైర్మన్, అధికారులు ఆర్టీసీ డీఎ౦తో గొడవకు దిగారు. ఇందుకు సంబంధించిన ప్రపోజల్స్ ఆర్టీసీ ఉన్నతాధికారులకు ముందుగానే పంపించామని చైర్మన్ వాదించగా.. తమకు ఎండీ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని డీఎ౦ స్పష్టం చేశారు. నా ప్రాణాలు పోయినా సరే ఇక్కడ పనులు మాత్రం జరగనివ్వమని డిపో మేనేజర్ చెప్పడంతో.. నువ్వు తమాషాలు చేస్తున్నావా అంటూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్.. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Tags:    

Similar News