యానాల భోజనాల కోసం కొట్టుకున్నారు

దిశ, ఏపీ బ్యూరో: ఉభయగోదావరి జిల్లాల్లో కరోనా విజృంభిస్తోంది. చెన్నై కోయంబేడు మార్కెట్ ఎఫెక్ట్ కోనసీమను వణికిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి తరువాత జరిగే యానాల భోజనాలు బాగాలేవంటూ కొట్టుకున్న సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఆకివీడు మండలం కోళ్ల పర్రు గ్రామంలో గండికోట స్వామి వివాహం ఈ నెల 15న జరిగింది. పెళ్లి తరువాత సంప్రదాయ బద్దంగా యానాల భోజనాలకి దగ్గరి బంధువులకు పిలుస్తారు. 18న నిర్వహించిన యానాల భోజనాలు బాగాలేవని, […]

Update: 2020-06-20 00:24 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఉభయగోదావరి జిల్లాల్లో కరోనా విజృంభిస్తోంది. చెన్నై కోయంబేడు మార్కెట్ ఎఫెక్ట్ కోనసీమను వణికిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి తరువాత జరిగే యానాల భోజనాలు బాగాలేవంటూ కొట్టుకున్న సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఆకివీడు మండలం కోళ్ల పర్రు గ్రామంలో గండికోట స్వామి వివాహం ఈ నెల 15న జరిగింది. పెళ్లి తరువాత సంప్రదాయ బద్దంగా యానాల భోజనాలకి దగ్గరి బంధువులకు పిలుస్తారు. 18న నిర్వహించిన యానాల భోజనాలు బాగాలేవని, భోజనాలకు ఎవరూ రాలేదని పెళ్లి కూతురు బంధువులు విమర్శించారు. ఈ క్రమంలో పెళ్లి కొడుకు తల్లిదండ్రులు సమాధానం చెప్పారు. దీంతో మాటామాటా పెరిగింది. దీంతో పెళ్లి కూతురు బంధువులు పెళ్లి కొడుకు తల్లిదండ్రులపై దాడి చేసి గాయపరిచారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. వారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News