అన్నమాచార్య యూనివర్సిటీలో భారీ చోరీ!
దిశ, వెబ్‌డెస్క్ : సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుండటంతో దానికి తగ్గట్టుగా దొంగలు కూడా అపడేట్ అవుతున్నారు. కొత్తకొత్త పద్దతులను అనుసరించి మరీ గుట్టుచప్పుడు కాకుండా తమ పనిని చేసుకుని పోతున్నారు. దొంగతనం జరిగాక పోలీసులకు ఎలాంటి ఆనవాళ్లు సైతం వదలకుండా ఉండేందుకు టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు. మరికొందరైతే యూట్యూబ్ సాయంతో సరికొత్త దొంగతనం పద్దతులను ఫ్రీగా నేర్చుకుంటారు. ఈ క్రమంలోనే సీసీ కెమెరాల కేబుల్స్ కత్తిరించి భారీ మొత్తంలో దొంగతనానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని […]
దిశ, వెబ్‌డెస్క్ : సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుండటంతో దానికి తగ్గట్టుగా దొంగలు కూడా అపడేట్ అవుతున్నారు. కొత్తకొత్త పద్దతులను అనుసరించి మరీ గుట్టుచప్పుడు కాకుండా తమ పనిని చేసుకుని పోతున్నారు. దొంగతనం జరిగాక పోలీసులకు ఎలాంటి ఆనవాళ్లు సైతం వదలకుండా ఉండేందుకు టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు. మరికొందరైతే యూట్యూబ్ సాయంతో సరికొత్త దొంగతనం పద్దతులను ఫ్రీగా నేర్చుకుంటారు. ఈ క్రమంలోనే సీసీ కెమెరాల కేబుల్స్ కత్తిరించి భారీ మొత్తంలో దొంగతనానికి పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళితే.. ఏపీలోని కడప జిల్లా అన్నమాచార్య యూనివర్సిటీలో దొంగలు తన చాలా తెలివిగా వ్యవహరించారు. రూ. 40లక్షల విలువచేసే కంప్యూటర్లు, ఇంటర్నల్ పార్ట్స్, ర్యామ్స్‌ను చోరీ చేశారు. దొంతనం చేశాక ఎవరికి దొరకకుండా ఉండేందుకు ముందుగానే సీసీ కెమెరాల కనెక్షన్లను తొలగించారు. దాంతో చోరీకి పాల్పడిన వారి గురించి చిన్న క్లూ కూడా లేకుండా పోయింది. దొంగతనం జరిగిన మరుసటి రోజు కాలేజీకి వచ్చిన చైర్మన్ బొప్పా ఎల్లారెడ్డి అసలు విషయం గుర్తించి తొలుత షాక్‌కు గురయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.