మాలవత్ పూర్ణ విజయాలను కించపర్చిన వారిపై ఫిర్యాదు
దిశ, క్రైమ్‌బ్యూరో: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలవత్ పూర్ణ విజయాలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. మంగళవారం బషీర్‌బాగ్‌లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు టీజీపీఏ అధ్యక్షుడు జాన్‌కుమార్, స్వేరోస్ ఇంటర్నేషనల్ రాష్ట్ర అధ్యక్షులు సునీల్, గురుకుల విద్యాలయాల సంస్థ లీగల్ సెల్ సలహాదారులు సురేష్ వినతిపత్రం అందజేశారు. ఎవరెస్టు శిఖరంతో పాటు కిలిమంజారో, ఎలిబోరో, […]
దిశ, క్రైమ్‌బ్యూరో: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలవత్ పూర్ణ విజయాలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. మంగళవారం బషీర్‌బాగ్‌లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు టీజీపీఏ అధ్యక్షుడు జాన్‌కుమార్, స్వేరోస్ ఇంటర్నేషనల్ రాష్ట్ర అధ్యక్షులు సునీల్, గురుకుల విద్యాలయాల సంస్థ లీగల్ సెల్ సలహాదారులు సురేష్ వినతిపత్రం అందజేశారు. ఎవరెస్టు శిఖరంతో పాటు కిలిమంజారో, ఎలిబోరో, ఆకాశ్ గుహ, కార్టెసెంజ్ పిరమిడ్ శిఖరాలను అధిరోహించి తెలంగాణకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిన మాలవత్ పూర్ణను ఓర్వలేని పశ్చిమబెంగాల్‌కు చెందిన ముఖార్జీ దేబ్రాత కించపరిచే విధంగా పోస్టులు పెట్టారని ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో టీజీపీఏ రాష్ట్ర కార్యదర్శి నెమలి రవికుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి నరేష్, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిలక్ష్మీ, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల సీఆర్వో రాంచందర్ పాల్గొన్నారు.