ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని..హోంమంత్రిపై ఫిర్యాదు

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని హోంమంత్రి మహమూద్ అలీపై చాదర్‌ఘాట్ పీఎస్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ ఫిర్యాదు చేశారు. పట్టభద్రుల మండలి ఎన్నికల్లో ఆదివారం ఆయన ఓల్డ్ మలక్‌పేట‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి‌కి ఓటు వేశానని, పవన్ కల్యాణ్ కూడా వాణీదేవికి మద్దతు తెలిపారని బహిరంగంగా చెప్పారు. మీడియా ముందు ఇలా వ్యాఖ్యానించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని బొల్లు కిషన్ పోలీసులకు […]

Update: 2021-03-14 11:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని హోంమంత్రి మహమూద్ అలీపై చాదర్‌ఘాట్ పీఎస్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ ఫిర్యాదు చేశారు. పట్టభద్రుల మండలి ఎన్నికల్లో ఆదివారం ఆయన ఓల్డ్ మలక్‌పేట‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి‌కి ఓటు వేశానని, పవన్ కల్యాణ్ కూడా వాణీదేవికి మద్దతు తెలిపారని బహిరంగంగా చెప్పారు. మీడియా ముందు ఇలా వ్యాఖ్యానించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని బొల్లు కిషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోంమంత్రి మహమూద్ అలీ ఓటును రద్దు చేసి ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత జటంగి సురేష్ యాదవ్ హోంమంత్రిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.

 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..