మంత్రి పువ్వాడకు ఫోన్ చేసి విషయం చెప్పిన కేసీఆర్

దిశ, ఖ‌మ్మం: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద బుధ‌వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాల‌కు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల‌ ఎక్స్ గ్రేషియాను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఉదయం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనలో మృతి చెందిన 12 మందికి (తెలంగాణ మ‌రియు ఆంధ్రా మృతులకు) ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు ప్రకటించారు. ఖమ్మం […]

Update: 2020-06-17 23:24 GMT

దిశ, ఖ‌మ్మం: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద బుధ‌వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాల‌కు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల‌ ఎక్స్ గ్రేషియాను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఉదయం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనలో మృతి చెందిన 12 మందికి (తెలంగాణ మ‌రియు ఆంధ్రా మృతులకు) ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు ప్రకటించారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

Tags:    

Similar News