ఏపీలో కరోనా నియంత్రణకు కమిటీలు

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సిఫారసుల ప్రకారం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న పిలుపు మేరకు ప్రభుత్వం ఆరు కమిటీలను నియమించింది. ఈ నేపథ్యంలోనే అర్బన్, రూరల్, ఇండస్ట్రియల్, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, అగ్రికల్చర్, వాణిజ్య విభాగాల్లో ఆయా విభాగాల ప్రిన్పిపల్ లేదా స్పెషల్ సెక్రటరీల ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులు గల కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ […]

Update: 2020-05-13 10:15 GMT

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సిఫారసుల ప్రకారం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న పిలుపు మేరకు ప్రభుత్వం ఆరు కమిటీలను నియమించింది. ఈ నేపథ్యంలోనే అర్బన్, రూరల్, ఇండస్ట్రియల్, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, అగ్రికల్చర్, వాణిజ్య విభాగాల్లో ఆయా విభాగాల ప్రిన్పిపల్ లేదా స్పెషల్ సెక్రటరీల ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులు గల కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు ఆయా శాఖల్లో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి చేపట్టాల్సిన చర్యలు, విధివిధానాలు ఈ నెల 17వ తేదీ లోపు ఖరారు చేయనున్నాయి. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ నీలం సహానీ ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News