డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించిన కమిషనర్
దిశ, మెదక్: లాక్‌డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని పోలీస్ అధికారులకు, సిబ్బందికి సీపీ జోయల్ డేవిస్ ఆదేశించారు. ఆయన సిద్దిపేట పట్టణం విక్టరీ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, ముస్తాబాద్ చౌరస్తాలలో డ్రోన్ కెమెరాతో ప్రత్యక్షంగా పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయడానికి ఉదయం, సాయంత్రం డ్రోన్ కెమెరాతో పర్యవేక్షించాలన్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, పోలీసులకు సహకరించాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం […]
దిశ, మెదక్: లాక్‌డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని పోలీస్ అధికారులకు, సిబ్బందికి సీపీ జోయల్ డేవిస్ ఆదేశించారు. ఆయన సిద్దిపేట పట్టణం విక్టరీ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, ముస్తాబాద్ చౌరస్తాలలో డ్రోన్ కెమెరాతో ప్రత్యక్షంగా పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయడానికి ఉదయం, సాయంత్రం డ్రోన్ కెమెరాతో పర్యవేక్షించాలన్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, పోలీసులకు సహకరించాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ అడ్రస్ ప్రూఫ్ కలిగి ఉండాలని తెలిపారు.
Tags: Commissioner, overseas, Siddipet, situation, drone camera, police