‘రైతులకు సూచన : యాసంగిలో ఇవే పండించాలి’

దిశ, వైరా : ప్రస్తుత యాసంగి సీజన్‌లో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మండలంలోని ఖానాపురం గ్రామంలో ప్రత్యామ్నాయ పంటలపై గురువారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు  ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రైతులు వరికి బదులు వేరుశెనగ వంటి పంటలను  సాగు చేయాలన్నారు. యాసంగిలో ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదని అందువలన రైతులు […]

Update: 2021-12-23 03:37 GMT

దిశ, వైరా : ప్రస్తుత యాసంగి సీజన్‌లో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మండలంలోని ఖానాపురం గ్రామంలో ప్రత్యామ్నాయ పంటలపై గురువారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రైతులు వరికి బదులు వేరుశెనగ వంటి పంటలను సాగు చేయాలన్నారు.

యాసంగిలో ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదని అందువలన రైతులు వరి సాగు చేయవద్దని చెప్పారు. రైతులు వరి సాగు చేసి ఇబ్బందులకు గురి కావద్దన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఎం విజయనిర్మల ఏడీఏ‌లు సరిత, బాబూరావు ఏవో పవన్ కుమార్, సర్పంచ్‌లు షేక్ సిరా ఫర్హాద్ , వేమిరెడ్డి విజయలక్ష్మి ఎంపీడీవో ఎన్ వెంకటపతిరాజు, తహసీల్దార్ అరుణ ఏఈఓల, ఆర్ ఐలుపాల్గొన్నారు.

Tags:    

Similar News