బ్రేకింగ్ న్యూస్: ఈటలపై కలెక్టర్ సంచలన నివేదిక

దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి ఈటల భూ వ్యవహారంలో పూర్తిస్థాయి నివేదిక సీఎస్​కు చేరింది. మెదక్​ జిల్లా కలెక్టర్​ హరీష్​ ఈ నివేదికను అందించారు. మొత్తం 20 మంది బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. బాధితుల వివరాలన్నింటినీ నివేదికల్లో పొందుపర్చారు. మంత్రి ఈటలకు చెందిన జమునా హాచరీస్​ 66.01 ఎకరాల అసైన్డ్​ భూమిని కబ్జా చేసినట్లు సూచించారు. మొత్తం 315.3‌‌0 ఎకరాల భూమి ఉండగా… ఇందులో 121.27 ఎకరాల భూమిని ఆదీనంలో పెట్టుకున్నట్లు నివేదికల్లో వెల్లడించారు. […]

Update: 2021-05-02 06:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి ఈటల భూ వ్యవహారంలో పూర్తిస్థాయి నివేదిక సీఎస్​కు చేరింది. మెదక్​ జిల్లా కలెక్టర్​ హరీష్​ ఈ నివేదికను అందించారు. మొత్తం 20 మంది బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. బాధితుల వివరాలన్నింటినీ నివేదికల్లో పొందుపర్చారు. మంత్రి ఈటలకు చెందిన జమునా హాచరీస్​ 66.01 ఎకరాల అసైన్డ్​ భూమిని కబ్జా చేసినట్లు సూచించారు.

మొత్తం 315.3‌‌0 ఎకరాల భూమి ఉండగా… ఇందులో 121.27 ఎకరాల భూమిని ఆదీనంలో పెట్టుకున్నట్లు నివేదికల్లో వెల్లడించారు. మరో 3.11 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు ప్రహారీ గోడను నిర్మాణం చేసినట్లు రిపోర్ట్​లో వివరించారు. మంత్రి ఈటలకు సంబంధించిన జమునా హాచరీస్​ ఈ భూములను కబ్జా చేసినట్లు పేర్కొన్నారు. అదే విధంగా అసైన్డ్​ ల్యాండ్​ నుంచే రోడ్డు నిర్మాణం చేశారని, వాల్టా చట్టానికి విరుద్ధంగా చెట్లు నరికివేసినట్లు ఫారెస్ట్​ అధికారుల విచారణలో తేలిందని కలెక్టర్​ నివేదికల్లో పేర్కొన్నారు. వ్యవసాయ భూమిలో నాలా చట్టానికి విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని నివేదికల్లో వెల్లడించారు. ఈ నివేదికను సీఎస్​కు సమర్పించారు.

 

Tags:    

Similar News