పల్లెలను హరిత విలేజ్‌లుగా తీర్చిదిద్దాలి

దిశ, నిజామాబాద్ : సాధారణ పల్లెలను హరిత పల్లెలుగా తీర్చిదిద్దాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. జిల్లాలోని రామారెడ్డి మండలం కన్నాపూర్‌లో శనివారం మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ పై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు. కోతుల సంరక్షణ కోసం అన్ని గ్రామాల్లో మంకీ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసి, పండ్ల మొక్కలను నాటాలన్నారు.ఈ నెల 20 నుంచి […]

Update: 2020-06-13 01:29 GMT

దిశ, నిజామాబాద్ :
సాధారణ పల్లెలను హరిత పల్లెలుగా తీర్చిదిద్దాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. జిల్లాలోని రామారెడ్డి మండలం కన్నాపూర్‌లో శనివారం మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ పై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు. కోతుల సంరక్షణ కోసం అన్ని గ్రామాల్లో మంకీ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసి, పండ్ల మొక్కలను నాటాలన్నారు.ఈ నెల 20 నుంచి హరితహారం కార్యక్రమాన్ని ఓ పండుగలా నిర్వహించాలన్నారు. ఇంకుడు గుంతల ప్రాముఖ్యతపై గ్రామస్థులకు అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. పరిసరాల శుభ్రతతోనే వ్యాధులు దూరమవుతాయని చెప్పారు. దోమలు వ్యాప్తి చెందకుండా పల్లెల్లో ఫాగింగ్ యంత్రాలను ఉపయోగించాలని సూచించారు. కార్యక్రమంలో డీ‌ఆర్డీవో చంద్రమోహన్ రెడ్డి, ఎంపీవో సవిత, సర్పంచ్ రాజనర్సు, వీఆర్ఓ జ్యోతి, అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..