రుణమాఫీ డబ్బులు రెండ్రోజుల్లో జమ : కలెక్టర్

దిశ, ఆదిలాబాద్: పంట రుణమాఫీకి సంబంధించిన డబ్బులు రెండ్రోజుల్లోగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అయ్యేలా చూడాలని చూడాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం బ్యాంకర్లతో పంట రుణమాఫీ పథకంపై బ్యాంకుల వారీగా సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. లాక్‌డౌన్ సమయంలో బ్యాంకులు మెరుగైన సేవలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.25వేల లోపు పంట రుణాలను మాఫీ చేసి, నిధులు విడుదల చేసిందని, వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ అయ్యేలా […]

Update: 2020-05-20 06:56 GMT

దిశ, ఆదిలాబాద్: పంట రుణమాఫీకి సంబంధించిన డబ్బులు రెండ్రోజుల్లోగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అయ్యేలా చూడాలని చూడాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం బ్యాంకర్లతో పంట రుణమాఫీ పథకంపై బ్యాంకుల వారీగా సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. లాక్‌డౌన్ సమయంలో బ్యాంకులు మెరుగైన సేవలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.25వేల లోపు పంట రుణాలను మాఫీ చేసి, నిధులు విడుదల చేసిందని, వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ అయ్యేలా చూడాలని బ్యాంకర్లను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారుల వివరాలు తెలుసుకున్నారు. లబ్ధిదారుల అకౌంట్లలో ఏమైనా లోపాలుంటే సరిచేసి రుణమాఫీ డబ్బులు అకౌంట్లలో జమ చేయాలన్నారు. సమావేశంలో జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ హరికృష్ణ, వివిధ బ్యాంకుల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News