ఉద్యోగుల విభజన ఎఫెక్ట్.. నైట్ షిఫ్ట్‌లో కలెక్టర్ బిజీ
దిశ ప్రతినిధి, రంగారెడ్డి : ఉద్యోగుల విభజనలో జిల్లా కలెక్టర్‌తో పాటు అధికారులు నిమగ్నమయ్యారు. అన్ని జిల్లాల్లా కాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిస్థితి మరో రకంగా ఉంటుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు కొత్తగా ఏర్పడ్డాయి. రంగారెడ్డి జిల్లాలో మహబూబ్‌నగర్ జిల్లాలోని కొన్ని మండలాలు విలీనం అయ్యాయి. దాంతో పాటు వికారాబాద్ జిల్లాలో కూడా మహబూబ్‌నగర్‌లోని కొన్ని మండలాలు విలీనం కావడంతో ఉద్యోగుల విభజన అధికారులకు కత్తిమీద సాములాగా మారింది. […]
దిశ ప్రతినిధి, రంగారెడ్డి : ఉద్యోగుల విభజనలో జిల్లా కలెక్టర్‌తో పాటు అధికారులు నిమగ్నమయ్యారు. అన్ని జిల్లాల్లా కాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిస్థితి మరో రకంగా ఉంటుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు కొత్తగా ఏర్పడ్డాయి. రంగారెడ్డి జిల్లాలో మహబూబ్‌నగర్ జిల్లాలోని కొన్ని మండలాలు విలీనం అయ్యాయి. దాంతో పాటు వికారాబాద్ జిల్లాలో కూడా మహబూబ్‌నగర్‌లోని కొన్ని మండలాలు విలీనం కావడంతో ఉద్యోగుల విభజన అధికారులకు కత్తిమీద సాములాగా మారింది.
అంతేకాకుండా విభజన విషయంలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకంగా జిల్లాలకు కేటాయింపు జరిగేలా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ కృషి చేస్తున్నారు. రాత్రి, పగలు లేకుండా మూడు జిల్లాలకు సంబంధించిన 58 శాఖల అధికారులు, కలెక్టర్లు ఉద్యోగుల విభజనలో తలమునకలయ్యారు.