ధాన్యం అన్‌లోడింగ్‌లో వేగం పెంచాలి: కలెక్టర్ నారాయణరెడ్డి
దిశ, నిజామాబాద్: రైస్ మిల్లులకు వచ్చిన లారీల నుంచి ధాన్యం బస్తాల్ని త్వరత్వరగా అన్‌లోడింగ్ చేయాలని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మే 2 నుంచి 18 గంటలు, మే 4 నుంచి 12 గంటలపాటు ధాన్యాన్ని దించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో బుధవారం సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని కొనుగోలు కేంద్రాల్లో వేగం పెంచాలని అన్నారు. అంతటా కాంటాలు హమాలీ, గన్ని బ్యాగులు ఒకే క్రమంలో పని జరగాలని ఆదేశించారు. […]
దిశ, నిజామాబాద్: రైస్ మిల్లులకు వచ్చిన లారీల నుంచి ధాన్యం బస్తాల్ని త్వరత్వరగా అన్‌లోడింగ్ చేయాలని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మే 2 నుంచి 18 గంటలు, మే 4 నుంచి 12 గంటలపాటు ధాన్యాన్ని దించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో బుధవారం సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని కొనుగోలు కేంద్రాల్లో వేగం పెంచాలని అన్నారు. అంతటా కాంటాలు హమాలీ, గన్ని బ్యాగులు ఒకే క్రమంలో పని జరగాలని ఆదేశించారు. వెనువెంటనే రైస్ మిల్లులకు ధాన్యం రవాణా చేయాలని తెలిపారు. బోధన్ డివిజన్‌లో డిమాండ్ తక్కువగా ఉన్నందున ఆ వాహనాలను నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ మండలాలకు పంపించాలని తెలిపారు. సహకార సంఘాల చైర్మన్లు రైస్ మిల్లులకు అవసరమైన హమాలీలను స్థానికంగా గుర్తించి పంపించాలని కోరారు. ఇంకా మిల్లులకు ధాన్యం అలాట్ చేయకుంటే వెంటనే వారికి లక్ష్యాన్ని నిర్దేశించాలని చెప్పారు.
Tags: Nizamabad,collector,Narayana reddy,