ఇప్పటివరకూ 300 మందిని కాపాడారు..

దిశ ప్రతినిధి, వరంగల్: భారీ వర్షాల కారణంగా ప్రాణ నష్టం వాటిల్లకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటూ, చర్యలు చేపట్టాలని వరంగల్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. ఆదివారం ఆయన వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్, కమిషనర్ పమేలా సత్పతితో కలిసి నగరంలోని ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ముందుగా క్రిస్టియన్ నగర్‌లోని గాంధీనగర్, కాశిబుగ్గ, పద్మానగర్ ముంపు ప్రాంతాలను పరిశీలించారు. నగరంలో కురిసిన […]

Update: 2020-08-16 05:29 GMT

దిశ ప్రతినిధి, వరంగల్: భారీ వర్షాల కారణంగా ప్రాణ నష్టం వాటిల్లకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటూ, చర్యలు చేపట్టాలని వరంగల్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. ఆదివారం ఆయన వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్, కమిషనర్ పమేలా సత్పతితో కలిసి నగరంలోని ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ముందుగా క్రిస్టియన్ నగర్‌లోని గాంధీనగర్, కాశిబుగ్గ, పద్మానగర్ ముంపు ప్రాంతాలను పరిశీలించారు.

నగరంలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, ఆ ప్రాంత ప్రజల కోసం 13 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. అందులో సుమారు 3200 మందికి పునరావాసం కల్పించామన్నారు. ములుగు రోడ్ నాలాను పరిశీలించి, వరద నీరు వెళ్లేలా చెత్తాచెదారం ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది 24 గంటల పాటు పనిచేస్తున్నారని తెలిపారు. శనివారంతో పోల్చితే ఆదివారం కొంత వరద తగ్గుముఖం పట్టిందన్నారు.

మొదటి అంతస్తులో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సుముఖంగా ఉంటే వారిని కూడా పోలీస్ సహాయంతో పంపిస్తామని సీపీ వెల్లడించారు. ఇప్పటివరకూ సుమారు 350 మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు. బల్దియా ఆధ్యర్యంలో 12 జేసీబీలు, రెండు డోజర్ల ద్వారా అవసరమైన చోట యంత్రాలను వినియోగించి ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు చేర్చినట్టు వివరించారు. పునరావాస కేంద్రాల్లోని 3500 భోజనం కల్పిస్తున్నట్టు కమిషనర్ పమేలా సత్పతి చెప్పారు.

Tags:    

Similar News