సూపరో సూపర్.. రైతులతో కలిసి వరి నాట్లు వేసిన కలెక్టర్.. (వీడియో)

దిశ, మణుగూరు : దేశానికి రైతే రారాజు అని, దేశంలో ప్రతి ఒక్కరు సంతోషంగా మూడు పూటల అన్నం తింటున్నారంటే అది ఒక్క రైతు వల్లే అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దూరిశెట్టి అనుదీప్ అన్నారు. గురువారం పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం మండలంలో పర్యటించారు. అనంతరం రైతులతో కలిసి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొలంలో రైతులతో కలిసి వరి నాట్లు వేశారు. రైతు శ్రేయస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తోందని అన్నారు. […]

Update: 2021-08-19 04:47 GMT

దిశ, మణుగూరు : దేశానికి రైతే రారాజు అని, దేశంలో ప్రతి ఒక్కరు సంతోషంగా మూడు పూటల అన్నం తింటున్నారంటే అది ఒక్క రైతు వల్లే అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దూరిశెట్టి అనుదీప్ అన్నారు. గురువారం పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం మండలంలో పర్యటించారు. అనంతరం రైతులతో కలిసి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొలంలో రైతులతో కలిసి వరి నాట్లు వేశారు. రైతు శ్రేయస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తోందని అన్నారు. అనంతరం కరకగూడెంలోని గ్రామాలను సందర్శించారు.

రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. రైతులకు సరైన ఎరువులు, విత్తనాలు సకాలంలో ఉండేలాగా చూడాలని అధికారులకు తెలిపారు. రైతుల విషయంలో అధికారులు ఆశ్రద్ద చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఏది ఏమైనా జిల్లా కలెక్టర్ రైతు పొలాల్లోకి వచ్చి నాటు వేయడం సంతోషంగా ఉందని రైతులు తెలిపారు. మేము ఎన్నడూ ఇలాంటి కలెక్టర్ ని చూడలేదని పలువురు రైతులు వ్యాఖ్యానించారు. కలెక్టర్ పొలంలో దిగి నాటు వేస్తుంటే ఆశ్చర్యపోయామని గ్రామ ప్రజలు తెలిపారు. జిల్లా కలెక్టర్ చల్లగా ఉండాలని గ్రామ మహిళలు, రైతులు అన్నారు. దీనితో కరకగూడెం పర్యటన ముగించుకోని కొత్తగూడెంకు వెళ్లారు.

Tags:    

Similar News