ఎన్నికల సిబ్బంది పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం
దిశ, వనపర్తి : వనపర్తి జిల్లా పరిధిలో శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూతులలో ఓటింగ్ సరళిని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష, ఎస్పీ అపూర్వ రావు పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సైపై కలెక్టర్ యాస్మిన్ భాష ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలింగ్ బూత్‌కు వంద మీటర్ల దూరం వరకు సామాన్య జనం, రాజకీయ పార్టీల, స్వతంత్ర పార్టీల వారిని నిలవరించడంలో […]
దిశ, వనపర్తి : వనపర్తి జిల్లా పరిధిలో శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూతులలో ఓటింగ్ సరళిని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష, ఎస్పీ అపూర్వ రావు పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సైపై కలెక్టర్ యాస్మిన్ భాష ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలింగ్ బూత్‌కు వంద మీటర్ల దూరం వరకు సామాన్య జనం, రాజకీయ పార్టీల, స్వతంత్ర పార్టీల వారిని నిలవరించడంలో పోలీసుల వైఫల్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్‌లో మహిళలకు, పురుషులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. సీనియర్ సిటిజన్లకు, బాలింతలకు, దివ్యంగులకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు నేరుగా ఓటు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంలో కలెక్టర్ వెంట జిల్లా శాసనమండలి ఎన్నికల ఇంచార్జి అధికారి రాజేందర్ గౌడ్, ఉన్నారు.