అకౌంట్లలో నగదు జమకాకపోవొచ్చు: కలెక్టర్

దిశ, రంగారెడ్డి: ‘మేం చెబుతున్నది మీ కోసమే. మేం చెప్పిన విధానాలను అనుసరించండి. అలా చేస్తే మీకే లాభం చేకూరతది. ఆ నగదు జమ కాకపోవొచ్చు.. కారణం అదే’ అంటూ కలెక్టర్ అమయ్ కుమార్ కొన్ని విషయాలు చెప్పారు. విషయమేమిటంటే.. రంగారెడ్డి జిల్లాలో వానాకాలం పంటల సాగు, నియంత్రిత వ్యవసాయం, రైతు వేదికల నిర్మాణం, వ్యవసాయ సెజ్ ల ఏర్పాటు తదితర అంశాలపై శుక్రవారం వ్యవసాయ అధికారులు, తహశీల్దార్లు, రైతు బంధు ప్రతినిధులతో కలెక్టర్ అమయ్ కుమార్ […]

Update: 2020-05-22 06:27 GMT

దిశ, రంగారెడ్డి: ‘మేం చెబుతున్నది మీ కోసమే. మేం చెప్పిన విధానాలను అనుసరించండి. అలా చేస్తే మీకే లాభం చేకూరతది. ఆ నగదు జమ కాకపోవొచ్చు.. కారణం అదే’ అంటూ కలెక్టర్ అమయ్ కుమార్ కొన్ని విషయాలు చెప్పారు. విషయమేమిటంటే.. రంగారెడ్డి జిల్లాలో వానాకాలం పంటల సాగు, నియంత్రిత వ్యవసాయం, రైతు వేదికల నిర్మాణం, వ్యవసాయ సెజ్ ల ఏర్పాటు తదితర అంశాలపై శుక్రవారం వ్యవసాయ అధికారులు, తహశీల్దార్లు, రైతు బంధు ప్రతినిధులతో కలెక్టర్ అమయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదనపు కలెక్టర్ హరీశ్, రైతుబంధు జిల్లా కో-ఆర్డినేటర్ వంగేటి లక్ష్మరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి గీత, డీఆర్ఓ…, వ్యవసాయ శాస్త్రవేత్తలు విద్యా శేఖర్, సుధారాణి తదితరులు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయ సంబంధిత విషయాలు, మార్కెటింగ్ వ్యవస్థ, ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ తదితర విషయాలు చర్చించేందుకే ఈ రైతు వేదికలు ఉపయోగపడతాయని, జిల్లాలో ఉన్న 83 క్లస్టర్లలో వీటిని నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నియంత్రిత సాగు, వానాకాలంలో ఏఏ పంటలను సాగు చేయాలి, సేంద్రియ ఎరువుల వినియోగం తదితర అంశాలపై క్లస్టర్లు, గ్రామాల వారీగా రైతు చైతన్య సదస్సులను నిర్వహిస్తున్నట్టు అమయ్ కుమార్ వివరించారు. క్లస్టర్ల వారీగా ఏర్పాటు చేసే రైతు చైతన్య సదస్సులకు ప్రజాప్రతినిధులందరితోపాటు సహకార సంఘాలు, రైతు బంధు ప్రతినిధులను ఆహ్వానించాలని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో 18162 మంది రైతులకు రైతు బంధు నగదును సంబంధిత మండల వ్యవసాయాధికారుల ద్వారా బ్యాంకులలో జమ చేశామని, అయితే బ్యాంకు అకౌంట్లు సరిగా లేకపోవడం, ఆధార్ నెంబర్లు లేకపోవడం తదితర స్వల్ప సమస్యల వల్ల కొందరికి అకౌంట్లలో నగదు జమకాలేకపోవచ్చని, ఈ సమ్యస్యలను వెంటనే పరిష్కరించాలని ఏవోలను ఆదేశించారు. జిల్లాలో వ్యవసాయ ఆర్థిక మండళ్ల ఏర్పాటు, నియోజకవర్గాల వారీగా గోదాముల నిర్మాణాలకు భూములను సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రైతుబంధు జిల్లా అధ్యక్షులు వంగేటి లక్ష్మ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే మక్కలు నిల్వలు అధికంగా ఉండడం, పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్ గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి అతి తక్కువ ధరకే మక్కలు లభిస్తున్నందున ఈ సారి జిల్లాలో మక్క పంటను వెయ్యొద్దని మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు విద్యా శేఖర్, సుధారాణిలు జిల్లాలో వరి, పత్తి, కందులు, కూరగాయల సాగు తదితర సూచించిన పంటల విత్తనాలు, సేంద్రియ వ్యవసాయం సంబంధిత అంశాలపై పలు సలహాలు, సూచనలను చేశారు.

Tags:    

Similar News