సరదాలకు ఇది సమయం కాదు

దిశ, కొత్తగూడెం: గతకొన్ని రోజులుగా వరద ఉధృతి ప్రవహిస్తున్నందున ఎవరూ వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని, సెల్ఫీలు దిగడం, చేపలు పట్టడం, సరదాలకు ఇది సమయం కాదని కలెక్టర్ ఎంవీ రెడ్డి ప్రజలను హెచ్చరికలు జారీ చేశారు. నీటితో నిండిన జలాశయాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నందున నిషేదం విధించినట్టు చెప్పారు. నిబంధనలు అతిక్రమించే వ్యక్తులకు జరిమానా లేదా పోలీస్ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. జలాశయాలు నిండి అలుగులు పడుతున్నాయని ఈ సమయంలో ప్రజలు […]

Update: 2020-08-17 09:36 GMT

దిశ, కొత్తగూడెం: గతకొన్ని రోజులుగా వరద ఉధృతి ప్రవహిస్తున్నందున ఎవరూ వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని, సెల్ఫీలు దిగడం, చేపలు పట్టడం, సరదాలకు ఇది సమయం కాదని కలెక్టర్ ఎంవీ రెడ్డి ప్రజలను హెచ్చరికలు జారీ చేశారు. నీటితో నిండిన జలాశయాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నందున నిషేదం విధించినట్టు చెప్పారు. నిబంధనలు అతిక్రమించే వ్యక్తులకు జరిమానా లేదా పోలీస్ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

జలాశయాలు నిండి అలుగులు పడుతున్నాయని ఈ సమయంలో ప్రజలు చేపలు పట్టడం, కుటుంబ సభ్యులతో సందర్శన చేయడం, ప్రవాహాన్ని దాటాలని సాహసాలు చేయడం వల్ల ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని సూచించారు. మండల, మున్సిపల్ కేంద్రాల్లో ప్రజా సమాచారం నిమిత్తం తక్షణం హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News