రెవెన్యూ ఉద్యోగుల సస్పెన్షన్..!

దిశ,వెబ్‌డెస్క్ : ఏపీలోని కర్నూలు జిల్లా గడివేముల మండలం గనిలో ప్రభుత్వ భూముల గోల్‌మాల్ వ్యవహారంలో రెవెన్యూ అధికారుల హస్తముందని పలు ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ విచారణకు ఆదేశించారు. విచారణలో ఆరోపణలు వాస్తవమని తేలడంతో గురువారం గడివేముల తహసీల్దార్ ఇంద్రాణి, వీఆర్వో ఈశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేశారు. అధికారులతో పాటే కంప్యూటర్ ఆపరేటర్ పార్వతి, కొరటమద్ది వీఆర్‌ఏ బాలచంద్రుడిపై కలెక్టర్ వేటేశారు. ఇకమీదట కూడా ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన […]

Update: 2020-09-03 01:39 GMT

దిశ,వెబ్‌డెస్క్ : ఏపీలోని కర్నూలు జిల్లా గడివేముల మండలం గనిలో ప్రభుత్వ భూముల గోల్‌మాల్ వ్యవహారంలో రెవెన్యూ అధికారుల హస్తముందని పలు ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ విచారణకు ఆదేశించారు.

విచారణలో ఆరోపణలు వాస్తవమని తేలడంతో గురువారం గడివేముల తహసీల్దార్ ఇంద్రాణి, వీఆర్వో ఈశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేశారు. అధికారులతో పాటే కంప్యూటర్ ఆపరేటర్ పార్వతి, కొరటమద్ది వీఆర్‌ఏ బాలచంద్రుడిపై కలెక్టర్ వేటేశారు. ఇకమీదట కూడా ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలుంటాయని కలెక్టర్ వీరపాండ్యన్ రెవెన్యూ యంత్రాంగాన్ని హెచ్చరించారు.

Tags:    

Similar News