అధికారులకు అప్రమత్తత అవసరం : కలెక్టర్ కర్ణన్

          మేడారం జాతరలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు. బుధవారం సాయంత్రం జంపన్నవాగు పరిసర ప్రాంతాలను ఆయన సందర్శించారు. వాగు వద్ద విధుల్లో ఉన్న అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నందున ఎవరికి కేటాయించిన విధుల్లో వారు తయారుగా ఉండి అన్నివేళలా భక్తులకు అందుబాటులో ఉండి వారికి సూచనలివ్వాలన్నారు. అమ్మవారి దర్శనం చేసుకునే సమయంలో త్వరత్వరగా ఇతరులకు ఛాన్స్ ఇచ్చేలా […]

Update: 2020-02-05 09:21 GMT

మేడారం జాతరలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు. బుధవారం సాయంత్రం జంపన్నవాగు పరిసర ప్రాంతాలను ఆయన సందర్శించారు. వాగు వద్ద విధుల్లో ఉన్న అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నందున ఎవరికి కేటాయించిన విధుల్లో వారు తయారుగా ఉండి అన్నివేళలా భక్తులకు అందుబాటులో ఉండి వారికి సూచనలివ్వాలన్నారు. అమ్మవారి దర్శనం చేసుకునే సమయంలో త్వరత్వరగా ఇతరులకు ఛాన్స్ ఇచ్చేలా చూడాలన్నారు. జంపన్నవాగు ఘటనలపై జిల్లా మత్స్యశాఖ అధికారి వీరన్నను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాగు వద్ద పారిశుధ్య ఏర్పాట్లను కలెక్టర్ స్వయంగా కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. ఆ సమయంలో కలెక్టర్ వెంట ఐటీడీఏ పీవో హనుమంతు కొండిబా, మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్, అధికారులు ఉన్నారు.

Tags:    

Similar News