నిత్యావసర సరకుల పంపిణీ : కలెక్టర్ నారాయణ రెడ్డి

దిశ, నిజామాబాద్ :లాక్ డౌన్ వలన చాలా మంది నిరుపేదలు,వలస కూలీలు తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని భరోసా కల్పించేందుకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ముందుకు వచ్చారు. ప్రభుత్వం తరఫున నగరంలోని పేదలకు నిత్యావసర సరుకులను గురువారం పంపిణీ చేశారు. ప్రగతి భవన్ వద్ద టీఎన్జీవోస్, ముత్తూట్ ఫైనాన్స్ సంయుక్త ఆధ్వర్యంలో 350మంది నిరుపేదలకు కలెక్టర్ నారాయణ రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సరుకుల్లో బియ్యం, పప్పు, కారంపొడి, […]

Update: 2020-04-09 04:08 GMT

దిశ, నిజామాబాద్ :లాక్ డౌన్ వలన చాలా మంది నిరుపేదలు,వలస కూలీలు తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని భరోసా కల్పించేందుకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ముందుకు వచ్చారు. ప్రభుత్వం తరఫున నగరంలోని పేదలకు నిత్యావసర సరుకులను గురువారం పంపిణీ చేశారు. ప్రగతి భవన్ వద్ద టీఎన్జీవోస్, ముత్తూట్ ఫైనాన్స్ సంయుక్త ఆధ్వర్యంలో 350మంది నిరుపేదలకు కలెక్టర్ నారాయణ రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సరుకుల్లో బియ్యం, పప్పు, కారంపొడి, పసుపు, టీ పొడి, ఆయిల్ ప్యాకెట్లు ఉన్నాయి. అనంతరం జిల్లా మీడియా ప్రతినిధులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా ప్రెసిడెంట్ కిషన్, సెక్రెటరీ అమృత్ కుమార్, ముత్తూట్ ఫైనాన్స్ రీజినల్ మేనేజర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: carona, lockdown, nessecities supply, collecter narayana reddy

Tags:    

Similar News