కోల్ మాఫియా అరెస్టు.. రూ.2.62 కోట్ల సామగ్రి స్వాధీనం
దిశ, వెబ్‌డెస్క్: అక్రమంగా బొగ్గు రవాణా చేస్తున్న కోల్ మాఫియా గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తంగా ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నంలోని రాందాస్ పల్లిలో ఈ ముఠా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసుకుని కోల్ దందా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. లారీల ఓనర్లతో ఒప్పందం కుదుర్చుకుని అక్రమంగా వ్యాపారం నడిపిస్తున్నట్లు తేలింది. విదేశాల నుంచి వచ్చిన బొగ్గును ఈ డంపింగ్ […]
దిశ, వెబ్‌డెస్క్: అక్రమంగా బొగ్గు రవాణా చేస్తున్న కోల్ మాఫియా గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తంగా ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నంలోని రాందాస్ పల్లిలో ఈ ముఠా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసుకుని కోల్ దందా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
లారీల ఓనర్లతో ఒప్పందం కుదుర్చుకుని అక్రమంగా వ్యాపారం నడిపిస్తున్నట్లు తేలింది. విదేశాల నుంచి వచ్చిన బొగ్గును ఈ డంపింగ్ యార్డ్‌కు తీసుకువచ్చి వాటిని కల్తీ చేసి పంపుతారని.. ఆ సరుకును కృష్ణా పట్నం, కొత్తగూడెంకు సరఫరా చేస్తారని విచారణలో నిందితులు అంగీకరించారు. ఇతర రాష్ట్రాల్లోని సిమెంట్ , ఐరన్ ఫ్యాక్టరీలకు కూడా ఈ బొగ్గును సరఫరా చేస్తారని కమిషనర్ వివరించారు.
క్వాలిటీ ఉన్న బొగ్గులో ఈ నకిలీ మిక్స్ చేసి కంపెనీలకు పంపుతారని తెలిపారు. ఈ వ్యవహారంలో 1050 టన్నుల బొగ్గు, రెండు లక్షల యాభై వేల నగదు, రెండు లారీలు సీజ్ చేసినట్లు సీపీ తెలిపారు. మొత్తంగా రూ.2.62 కోట్ల విలువ చేసే సామగ్రిని స్వాధీనం చేసుకుమన్నట్లు చెప్పారు.కాగా, ఈ బొగ్గు మాఫియా వెనుక ఇంకా ఎవరెవరూ ఉన్నారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ తెలిపారు.