సీఐడీకి సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కామ్..!

దిశ, వెబ్‎డెస్క్: సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల స్కామ్‎ కేసును ఏపీ ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో లబ్దిదారులకు జారీ చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఫ్యాబ్రికేట్ చేసి నకిలీ చెక్కులను సృష్టించి డబ్బులను డ్రా చేసినట్టుగా అధికారులు గుర్తించారు. సెక్రటేరియట్‎లోని రెవెన్యూ అసిస్టెంట్ సెక్రటరీ తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో జారీ చేసిన చెక్కులకే నకిలీగా తయారు చేసి కోల్‎కతా, బెంగళూరు, ఢిల్లీ బ్రాంచీల నుంచి డబ్బులు డ్రా చేసేందుకు యత్నించారు. […]

Update: 2020-09-21 11:19 GMT

దిశ, వెబ్‎డెస్క్:

సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల స్కామ్‎ కేసును ఏపీ ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో లబ్దిదారులకు జారీ చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఫ్యాబ్రికేట్ చేసి నకిలీ చెక్కులను సృష్టించి డబ్బులను డ్రా చేసినట్టుగా అధికారులు గుర్తించారు. సెక్రటేరియట్‎లోని రెవెన్యూ అసిస్టెంట్ సెక్రటరీ తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గతంలో జారీ చేసిన చెక్కులకే నకిలీగా తయారు చేసి కోల్‎కతా, బెంగళూరు, ఢిల్లీ బ్రాంచీల నుంచి డబ్బులు డ్రా చేసేందుకు యత్నించారు. రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే డబ్బులు డ్రా చేశారు. ఒక్క చెక్ డ్రా చేయలేదు. రెండు రోజుల క్రితం 45 వేలను డ్రా చేసేందుకు ప్రయత్నించాడు. అయితే సెక్రటేరియట్ ఎస్‎బీఐ బ్యాంకులో చెక్‎ను క్లియర్ చేసే విషయంలో అనుమానించాడు. వ్యక్తుల పేరు మీద కాకుండా సంస్థ పేరున సీఎంఆర్ఎఫ్ చెక్ రావడంపై ఎస్‎బీఐ అధికారులకు అనుమానం రావడంతో రెవెన్యూ అసిస్టెంట్ సెక్రటరీ వద్దకు చెక్‎ను పంపారు. అయితే చెక్ పై ఉన్న సంతకం కూడా తనది కాదని రెవెన్యూ అధికారి చెప్పడంతో చెక్‎ను క్లియర్ చేయలేదు. దీంతో రెవెన్యూ అధికారులు పోలీసులను ఆశ్రయించారు.

సచివాలయంలో విచారణ చేపట్టిన తుళ్లూరు పోలీసులు.. రెవెన్యూ శాఖలోని CMRF విభాగం అధికారులతోపాటు ఎస్‎బీఐ బ్రాంచి అధికారులను ప్రశ్నించారు. ఇక్కడ ఉద్యోగుల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. కృష్ణా జిల్లా మైలవరం, కడప జిల్లా పొద్దుటూరు, ప్రకాశం జిల్లాకు చెందిన బాధితుల పేరిట జారీ అయిన మూడు చెక్కులను ఫోర్జరీ చేసినట్టు గుర్తించారు. గతంలోనూ నకిలీ చెక్కులతో లక్షల్లో డబ్బులు డ్రా చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మరోవైపు మూడు రాష్ట్రాల పరిధిలో కేసులు ఉండడంతో సీఐడీకి బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Tags:    

Similar News