రోజూ దేవుడ్ని మొక్కుతున్నా : జగన్
దిశ, వెబ్‌డెస్క్: బీసీ సంక్రాంతి వేడుకలను విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇటీవల ప్రకటించిన 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా జ్యోతిరావ్ పూలే, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మహిళా అభ్యుదయంలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టామని అన్నారు. అంతేగాకుండా సంక్రాంతి పండుగ నెల […]
దిశ, వెబ్‌డెస్క్: బీసీ సంక్రాంతి వేడుకలను విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇటీవల ప్రకటించిన 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా జ్యోతిరావ్ పూలే, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మహిళా అభ్యుదయంలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టామని అన్నారు. అంతేగాకుండా సంక్రాంతి పండుగ నెల రోజుల ముందే వచ్చిందా అన్నట్లు ఉందని తెలిపారు. బీసీ కార్పొరేషన్లలో అత్యధిక శాతం మహిళలే ఉండటం సంతోషంగా ఉందన్నారు. వెనుకబడిన వర్గాలకు ఈ స్థాయిలో పదవులు దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని, అందులోనూ సగభాగం మహిళలకు ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదన్నారు. బలహీనవర్గాలను బలపరచడంలో తాము మొదటి స్థానంలో నిలిచామని తెలిపారు. ఇంకా మంచి చేసేలా వనరులు ఇవ్వాలని రోజూ దేవుడ్ని మొక్కుతున్నట్టు వెల్లడించారు.
మొత్తం ప్రమాణ స్వీకారం చేసిన డైరెక్టర్లలో 336 మంది మహిళలే ఉన్నారని స్పష్టం చేశారు. పదవులు మాత్రమే కాదు.. మీ భుజస్కందాలపై మోపిన బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. సూర్యోదయం కంటే ముందే 1వ తేదీన పెన్షన్ ఇస్తున్నామని.. రూ.25 వేల కోట్లను పెన్షన్ల కోసం ఖర్చు చేశామని అన్నారు. డైరెక్టర్లకు ఇచ్చింది పదవి కాదని.. పవిత్రమైన బాధ్యత అని గుర్తుచేశారు. తమ పనితీరుతో ప్రతి పేదవాడి ఇంట్లోనూ చిరునవ్వు కనిపించేలా చేయాలని అన్నారు. కార్పొరేషన్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని సూచించారు. గ్రామ వాలంటీర్లు అద్భుతమైన సేవ చేస్తున్నారని, వారి సేవలకు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలని సీఎం జగన్ ఆదేశించారు. బీసీలంటే వెనుకబడిన కులాలు కాదు.. వెన్నుముఖ కులాలు అని అభిప్రాయపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన ఈ స్వల్ప కాలంలోనే మేనిఫెస్టో ఇచ్చిన హామీల్లో 90 శాతం వరకూ నెరవేర్చామని తెలిపారు.
ఇళ్ల పట్టాల కోసం ఓ యుద్ధం చేశామని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వంలో 4.45 కోట్ల మంది బీసీలకు లబ్ధి చేకూరిందని అన్నారు. వారి అభివృద్ధి కోసమే శశ్వాత బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేగాకుండా రాష్ట్ర కేమినెట్‌లో కూడా 60 శాతానికి పైగా బీసీలను చేర్చామని.. చంద్రబాబు హయాంలో ఒక్కరు కూడా బీసీలు రాజ్యసభకు వెళ్లలేదని గుర్తుచేశారు. ఎన్నికల మేనిఫెస్టోను తాము భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావిస్తామని, అయిదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, మెనార్టీ వర్గాలకు చెందినవారే. తాము అధికరంలో 18 నెలల్లోనే బీసీల సంక్షేమం కోసం రూ.38,519 కోట్లు ఖర్చు చేశామని, రైతు భరోసా ద్వారా రూ.6140 కోట్లు పెట్టుబడి సాయం అందించామని, సున్నా వడ్డీ పథకం ద్వారా 7.14 లక్షల బీసీ కుటుంబాలకు లబ్దిచేకూరిందని అన్నారు. అంతేగాకుండా ఈనెల 25న 31లక్షల మందికిపైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని, 15 రోజులపాటు ప్రతి నియోజకవర్గంలో పంపిణీ చేస్తారని సీఎం జగన్ హామీ ఇచ్చారు.