క్లీన్ ఏపీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు, నగరాలు పరిశుభ్రంగా ఉంచాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ‘క్లీన్‌ ఆంద్రప్రదేశ్‌ (క్లాప్‌)–జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. గాంధీ జయంతి సందర్భంగా శనివారం విజయవాడలోని బెంజ్ సర్కిల్‌లో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం సీడీని ఆవిష్కరించారు. 4,097 చెత్త వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. 100 రోజులపాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం […]

Update: 2021-10-02 03:53 GMT

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు, నగరాలు పరిశుభ్రంగా ఉంచాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ‘క్లీన్‌ ఆంద్రప్రదేశ్‌ (క్లాప్‌)–జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. గాంధీ జయంతి సందర్భంగా శనివారం విజయవాడలోని బెంజ్ సర్కిల్‌లో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం సీడీని ఆవిష్కరించారు. 4,097 చెత్త వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. 100 రోజులపాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కొనసాగనుంది. క్లాప్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రజలు ఆరోగ్యకరమైన పరిసరాల్లో ఆహ్లాదంగా గడపాలన్నదే ‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్ (క్లాప్‌)–జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. క్లాప్‌ కార్యక్రమంలో భాగంగా బిన్‌ ఫ్రీ, లిటర్‌ ఫ్రీ, గార్బేజ్‌ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే జాతీయస్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో ఉత్తమ ర్యాంక్‌ సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

మహాత్ముడి ఆశయాలతో ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’.. సీఎం వైఎస్ జగన్

మహాత్మ గాంధీ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ‘గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేసేందుకు గ్రామ/వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థను ఏర్పాటు చేసినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 'క్లీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌'కు శ్రీ‌కారం చుడుతున్నాం. మ‌హాత్ముడి జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు’ అంటూ సీఎం జగన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అలాగే మాజీ ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి 117వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు కూడా నివాళులర్పించారు. ‘భారత మాజీ ప్రధాని, జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని ఒక్కటిగా నిలిపిన ధీరోదాత్తుడు లాల్‌ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి’ అంటూ మరో ట్వీట్ చేశారు.

ఇంటింటికి మూడు డస్ట్ బిన్లు..

క్లాప్ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలోని ప్రతీ ఇంటికి మూడు డస్ట్ బిన్‌లను ప్రభుత్వం పంపిణీ చేయాలని నిర్ణయించింది. గృహాల్లోనే తడి, పొడి, ప్రమాదకర (నాప్‌కిన్స్, సూదులు, గ్లౌజ్‌లు, ఎలక్ట్రికల్‌) చెత్తను వేరు చేసేందుకు డస్ట్‌బిన్‌లను పంపిణీ చేస్తోంది. 123 కార్పొరేషన్‌లు, మునిసిపాలిటీల్లోని 40 లక్షల గృహాలకు 1.20 కోట్ల డస్ట్‌ బిన్‌లు పంపిణీ చేస్తారు. ఇందుకు రూ.100 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే అత్యధిక జనాభా ఉన్న ప్రాంతాల్లో 1,500 పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చెత్త సేకరణ, తరలింపు కోసం 3,097 ఆటో టిప్పర్లు, 1,771 ఎలక్ట్రిక్‌ ఆటోలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది.

Tags:    

Similar News