‘వరద సాయంలో ఎవరికీ అన్యాయం జరగదు’.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

వరద సాయం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు.

Update: 2024-09-25 09:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:వరద సాయం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఒక విపత్తు ఎదురైతే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంలో నూతన ఒరవడిని తీసుకొచ్చామని అన్నారు. మాటల్లో చెప్పడం కాకుండా చేసి చూపించామని అన్నారు. వరద బాధితుల అకౌంట్‌లో రూ.602 కోట్లు డైరెక్ట్‌గా వేశామన్నారు. వరదల కారణంగా మొత్తం 7,600 కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారు. గత పాలకులు చేసిన పాపాలు ప్రజలకు శాపంగా మారాయని అన్నారు.

కలెక్టరేట్‌లోనే మకాం పెట్టి తాను అధికారులను మొత్తం చేశానని అన్నారు. 150 డ్రోన్స్ వాడమన్నారు. ఎలాంటి విపత్తు ఎదురైనా సంఘటితంగా ఎదుర్కొంటాము అనడానికి ఇదే నిదర్శనం అన్నారు. వరదల కారణంగా జరిగిన నష్టాన్ని, అందించిన పరిహారాన్ని ఆయన వివరించారు. ఇన్సూరెన్స్ కంపెనీలను పిలిపించి క్లైమ్ లను పూర్తి చేస్తామన్నారు. 30లోగా దాని పూర్తి చేయాలని ఆదేశించాం, తాను బటన్ నొక్కి మాయ చేయడం లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


Similar News