సీఎం జగన్ కేసుల విచారణ వాయిదా..
దిశ, ఏపీబ్యూరో: సీఎం వైఎస్ జగన్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలకు సంబంధించిన అన్నీ కేసులపై విచారణను సీబీఐ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. సీఎం కోర్టుకు హాజరుకాలేరని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని శుక్రవారం జగన్ తరఫు లాయర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ తరహా కేసు పైనే ఈడీ ప్రత్యేక కోర్టు శుక్రవారం విచారణ ప్రారంభించింది. జగతి పబ్లికేషన్స్ తరపున న్యాయవాది జి.అశోక్‌రెడ్డి వాదనలు వినిపించారు. కేసును సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని […]
దిశ, ఏపీబ్యూరో: సీఎం వైఎస్ జగన్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలకు సంబంధించిన అన్నీ కేసులపై విచారణను సీబీఐ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. సీఎం కోర్టుకు హాజరుకాలేరని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని శుక్రవారం జగన్ తరఫు లాయర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఈ తరహా కేసు పైనే ఈడీ ప్రత్యేక కోర్టు శుక్రవారం విచారణ ప్రారంభించింది. జగతి పబ్లికేషన్స్ తరపున న్యాయవాది జి.అశోక్‌రెడ్డి వాదనలు వినిపించారు. కేసును సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశామన్నారు.ఈ కేసుపై తదుపరి విచారణను 20వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.