కరోనా పర్యవేక్షణ అధికారిగా సీఎం కార్యదర్శి నియామకం

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం మంత్రి ఈటల చుట్టూనే తిరుగుతున్నాయి. ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్ అంటిపెట్టుకున్నట్లు నోట్ వెలువడటం దానికి గవర్నర్ ఆమోద ముద్ర లభించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఏ శాఖ లేని మంత్రిగా ఈటల మిగిలిపోయారు. ఇదిలాఉండగా రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని కరోనా పర్యవేక్షణ అధికారిగా ముఖ్యమంత్రి నియమించారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి […]

Update: 2021-05-01 04:41 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం మంత్రి ఈటల చుట్టూనే తిరుగుతున్నాయి. ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్ అంటిపెట్టుకున్నట్లు నోట్ వెలువడటం దానికి గవర్నర్ ఆమోద ముద్ర లభించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఏ శాఖ లేని మంత్రిగా ఈటల మిగిలిపోయారు. ఇదిలాఉండగా రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని కరోనా పర్యవేక్షణ అధికారిగా ముఖ్యమంత్రి నియమించారు.

ఈ సందర్భంగా కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం. వైరస్ నియంత్రణకు ప్రతిరోజు మూడు సార్లు సమీక్ష జరపాలన్నారు. వ్యాక్సిన్, మందులు, ఆక్సిజన్, బెడ్ల విషయంలో ఉండొద్దన్నారు. తెలంగాణను కరోనా నుంచి బయట పడేయాలన్నారు.

Tags:    

Similar News