అంగన్‌వాడీల్లో నాడు నేడు పనులపై సీఎం సమీక్ష
దిశ, వెబ్ డెస్క్: అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు-నేడు పనులపై సీఎం వైఎస్ జగన్ సమీక్షను మంగళవారం నిర్వహించారు. మొదటి విడతలో 6,407 కొత్త అంగన్ వాడీ కేంద్రాలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. 2021 మార్చి నాటికి మొదటి దశ పనులు ప్రారంభించాలని అధికారులను ఆయన ఆదేశించారు. రెండున్నరేండ్లలో పనులు పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. 4171 అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు-నేడు కింద అభివృద్ధి పనులు చేయాలని అన్నారు. మొత్తం 27,438 […]
దిశ, వెబ్ డెస్క్: అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు-నేడు పనులపై సీఎం వైఎస్ జగన్ సమీక్షను మంగళవారం నిర్వహించారు. మొదటి విడతలో 6,407 కొత్త అంగన్ వాడీ కేంద్రాలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. 2021 మార్చి నాటికి మొదటి దశ పనులు ప్రారంభించాలని అధికారులను ఆయన ఆదేశించారు. రెండున్నరేండ్లలో పనులు పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. 4171 అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు-నేడు కింద అభివృద్ధి పనులు చేయాలని అన్నారు. మొత్తం 27,438 కొత్త అంగన్ వాడీ భవనాల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. 16681 అంగన్ వాడీ కేంద్రాల్లో అభివృద్ది పనులు చేపట్టాలని అన్నారు.