'సోషల్ డిస్టెన్స్'ను మించిన మార్గం లేదు
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ‘లాక్డౌన్’ విజయవంతంగా అమలవుతుండడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలంతా రానున్న రోజుల్లోనూ ఇదే పట్టుదలను, ఉత్సాహాన్ని చూపాలని పిలుపునిచ్చారు. మున్ముందు అధికార యంత్రాంగం సైతం ఇదే తరహాలో ‘లాక్డౌన్’ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు ‘సోషల్ డిస్టాన్స్’ను మించిన మార్గం లేదని వ్యాఖ్యానించారు. ‘లాక్డౌన్’ను విధిగా పాటించాలని ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న […]
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ‘లాక్డౌన్’ విజయవంతంగా అమలవుతుండడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలంతా రానున్న రోజుల్లోనూ ఇదే పట్టుదలను, ఉత్సాహాన్ని చూపాలని పిలుపునిచ్చారు. మున్ముందు అధికార యంత్రాంగం సైతం ఇదే తరహాలో ‘లాక్డౌన్’ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు ‘సోషల్ డిస్టాన్స్’ను మించిన మార్గం లేదని వ్యాఖ్యానించారు. ‘లాక్డౌన్’ను విధిగా పాటించాలని ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న ‘లాక్డౌన్’, రాత్రిపూట కర్ఫ్యూ, కరోనా వ్యాప్తి నిరోధానికి చేస్తున్న ప్రయత్నాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్లో అధికారులతో సమీక్షించారు.
విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా మెలుగుతున్నవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని కనిపెడుతూ ఉండాలని సూచించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి విషయంలో, క్వారంటైన్లో ఉన్న వారి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నొక్కిచెప్పారు. ‘లాక్డౌన్’, రాత్రి పూట కర్ఫ్యూ విజయవంతం కావడం పట్ల సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు ఇకముందు కూడా ఇదే విధంగా ప్రభుత్వానికి సహకరించి, సామాజిక దూరం పాటిస్తే ప్రమాదకరమైన వ్యాధి నుంచి రాష్ట్రాన్ని, తద్వారా దేశాన్ని కాపాడవచ్చని సిఎం పిలుపునిచ్చారు. ఎవరికి అనుమానం కలిగినా, వ్యాధి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
ఈ సమీక్షా సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎంఓ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉదయం నుంచి నుంచి రాత్రి పది గంటల వరకు తన కార్యాలయంలోనే ఉండి సిఎం పరిస్థితిని సమీక్షించారు. పోలీసు, వైద్య శాఖల సీనియర్ అధికారులు, పలు జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
tags : Telangana, Corona, LockDown, CM KCR, Review, Pragati Bhavan