వాటాలు తేలిన తర్వాతే బోర్డుల పని.. మంత్రి షేకావత్ ని కోరిన కేసీఆర్
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతి భద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ ఈ నెల 26న ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరపనున్న సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం షెకావత్ ను కలిసి.. కృష్ణా, గోదావరి నది జలాల అంశాలు, నది యాజమాన్య బోర్డుల పరిధి […]
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతి భద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ ఈ నెల 26న ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరపనున్న సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం షెకావత్ ను కలిసి.. కృష్ణా, గోదావరి నది జలాల అంశాలు, నది యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై 40 నిమిషాల పాటు చర్చించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రాజెక్టులనే బోర్డు పరిధిలో ఉంచాలని, వాటాలు తేలిన తర్వాతే బోర్డుల పని చేపట్టాలని కేసీఆర్ కేంద్ర మంత్రిని కోరారు.