జూన్ 8వరకు ధాన్యం కొనుగోళ్లు
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జూన్ 8వ తేదీ వరకు కొనసాగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖాధికారులకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. తొలుత రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మే 31వ తేదీ వరకే నిర్వహించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతుండడం, గతవారం రోజులుగా వర్షాలు తదితర కారణాలతో ధాన్యం సేకరణ పూర్తికాకపోవడం వల్ల […]
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జూన్ 8వ తేదీ వరకు కొనసాగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖాధికారులకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. తొలుత రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మే 31వ తేదీ వరకే నిర్వహించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతుండడం, గతవారం రోజులుగా వర్షాలు తదితర కారణాలతో ధాన్యం సేకరణ పూర్తికాకపోవడం వల్ల మరికొన్ని రోజులు ధాన్యం సేకరణ కేంద్రాలను కొనసాగించాలని పలువురు ప్రభుత్వాన్ని కోరడంతో పరిస్థితిని సమీక్షించిన సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.