ప్రధాని, రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ లేఖ

దిశ, వెబ్‎డెస్క్: ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‎నాథ్ కోవింద్‎కు సీఎం కేసీఆర్ వేర్వేరుగా లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని ప్రధాని మోదీని కోరారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే పరీక్షలు నిర్వహించడం వల్ల ఇతర అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దీంతో అన్ని రాష్ట్రాల యువకులు నష్టపోతున్నారని సీఎం కేసీఆర్ లేఖలో వెల్లడించారు. మరోవైపు రాష్ట్రపతికి రాసిన లేఖలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారక తపాలా స్టాంప్‌నకు […]

Update: 2020-11-20 00:48 GMT

దిశ, వెబ్‎డెస్క్: ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‎నాథ్ కోవింద్‎కు సీఎం కేసీఆర్ వేర్వేరుగా లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని ప్రధాని మోదీని కోరారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే పరీక్షలు నిర్వహించడం వల్ల ఇతర అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దీంతో అన్ని రాష్ట్రాల యువకులు నష్టపోతున్నారని సీఎం కేసీఆర్ లేఖలో వెల్లడించారు.

మరోవైపు రాష్ట్రపతికి రాసిన లేఖలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారక తపాలా స్టాంప్‌నకు త్వరగా అనుమతివ్వాలని కోరారు. దక్షిణాది విడిదికి వచ్చినప్పుడు పీవీ స్మారక తపాలా స్టాంప్‌ను హైదరాబాద్ లో విడుదల చేయాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News