శుష్కప్రియాలు.. శూన్య హస్తాలు
దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల కురిసిన వర్షాలు, సంభవించిన వరదలతో హైదరాబాద్ నగరం అతలాకుతలమై సుమారు రూ. 5 వేల కోట్ల నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయిని కూడా విడుదల చేయలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. తక్షణ సాయంగా రూ. 1,350 కోట్లను విడుదల చేయాల్సిందిగా ప్రధానికి లేఖ రాసినా, ఫోన్ చేసి మాట్లాడినా ఇప్పటివరకు సాయమే అందలేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి శుష్కప్రియాలు, శూన్య హస్తాలు అనేది మరోసారి రుజువైందన్నారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల కురిసిన వర్షాలు, సంభవించిన వరదలతో హైదరాబాద్ నగరం అతలాకుతలమై సుమారు రూ. 5 వేల కోట్ల నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయిని కూడా విడుదల చేయలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. తక్షణ సాయంగా రూ. 1,350 కోట్లను విడుదల చేయాల్సిందిగా ప్రధానికి లేఖ రాసినా, ఫోన్ చేసి మాట్లాడినా ఇప్పటివరకు సాయమే అందలేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి శుష్కప్రియాలు, శూన్య హస్తాలు అనేది మరోసారి రుజువైందన్నారు. దేశంలోనే అతి ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌కు నష్టం జరిగితే కనీస సాయం చేయకపోవడం దారుణమని అభివర్ణించారు. ఒకవైపు హైదరాబాద్‌లో నష్టం, మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో పంటల నష్టం జరిగినా కేంద్రం ఎంతోకొంత సాయం అందిస్తుందని ఆశించామని, కానీ అది అడియాశగానే మిగిలిపోయిందన్నారు.
ప్రగతి భవన్‌లో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆర్థిక అంశాలు, కరోనా కారణంగా పడిపోయిన ఆదాయం, బడ్జెట్‌కు సవరణలు తదితరాలపై చర్చ జరిపారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి వచ్చిన వరద సాయంపైనా ప్రస్తావన వచ్చినట్లు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. వర్షాలు, వరదల కారణంగా హైదరాబాద్ నగరంలో జనజీవితం స్తంభించిపోయి వేలాది కుటుంబాలు ఇంటి సామాన్లు నష్టపోయి ఆర్థికంగా చితికిపోయాయని అన్నారు. కానీ కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా సాయం అందలేదని సీఎం పేర్కొన్నారు. అక్టోబరు 15న ప్రధానికి లేఖ రాసినా ఇప్పటికీ స్పందన లేదని, సాయం అందలేదని గుర్తుచేశారు.