ఏపీ సర్కారుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం

దిశ, వెబ్‎డెస్క్: ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిరెడ్డి కెనాల్ విస్తరణను తీవ్రంగా ఖండించారు. కృష్ణానదిపై పోతిరెడ్డిపాడు తదితర ప్రాజెక్టుల నిర్మాణాలు ఆపకుంటే అలంపూర్-పెద్దమరూర్ దగ్గర బ్యారేజీ నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని తెలిపారు. నదీ జలాల విషయంలో ఏపీ సర్కారు ఇష్టమొచ్చినట్లు వ్యవహారిస్తే కుదరదని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ నీటి వాటాను కొల్లగొట్టాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్ర రైతాంగ […]

Update: 2020-10-06 09:48 GMT

దిశ, వెబ్‎డెస్క్: ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిరెడ్డి కెనాల్ విస్తరణను తీవ్రంగా ఖండించారు. కృష్ణానదిపై పోతిరెడ్డిపాడు తదితర ప్రాజెక్టుల నిర్మాణాలు ఆపకుంటే అలంపూర్-పెద్దమరూర్ దగ్గర బ్యారేజీ నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని తెలిపారు.

నదీ జలాల విషయంలో ఏపీ సర్కారు ఇష్టమొచ్చినట్లు వ్యవహారిస్తే కుదరదని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ నీటి వాటాను కొల్లగొట్టాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. నదీజలాల పంపిణీలో తమకు జరిగిన అన్యాయ ఫలితమే తెలంగాణ ఉద్యమమని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోల్పోయిన సాగునీటిని ప్రత్యేక రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుగా పొంది తీరుతామని తెలిపారు సీఎం కేసీఆర్. తెలంగాణలో కొనసాగుతున్న ప్రాజెక్టులు కొత్తవి కాదని.. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైందని చెప్పుకొచ్చారు.

కృష్ణానదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపాలని ఏపీ ప్రభుత్వానికి పలుమార్లు చెప్పామని సీఎం కేసీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగించడం బాధాకరమని అన్నారు. తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశం వివరాలు సరిగా నమోదు చేయలేదని.. నేటి రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్ణయాలను వీడియో, రాతపూర్వకంగా నమోదు చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం నదీజలాల వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్నారు.

Tags:    

Similar News