రేపు దుర్గమ్మను దర్శించుకోనున్న సీఎం జగన్

దిశ, ఏపీ బ్యూరో: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు. దీంతో అధికారులు సీఎం రాకకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాదాయ శాఖమంత్రి, వెలంపల్లి శ్రీనివాస్ సోమవారం సీఎం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం మూడు గంటల సమయంలో సీఎం జగన్ ఇంద్రకీలాద్రికి వస్తారని స్పష్టం చేశారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు […]

Update: 2021-10-11 04:41 GMT

దిశ, ఏపీ బ్యూరో: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు. దీంతో అధికారులు సీఎం రాకకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాదాయ శాఖమంత్రి, వెలంపల్లి శ్రీనివాస్ సోమవారం సీఎం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం మూడు గంటల సమయంలో సీఎం జగన్ ఇంద్రకీలాద్రికి వస్తారని స్పష్టం చేశారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అంతా దర్శనం చేసుకోవాలని మంత్రి సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో మూల నక్షత్రం ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు

Tags:    

Similar News