ఓటీఎస్ ద్వారా 52లక్షల మందికి లబ్ధి.. తణుకు సభలో సీఎం వైఎస్ జగన్‌

దిశ, ఏపీ బ్యూరో : ‘ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తోంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా అది సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు 31 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశాం. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా సొంతింటి కల నెరవేరుస్తున్నాం. 50 లక్షల మంది కుటుంబాలకు మంచి జరిగే రోజు ఇది. ఇల్లు అంటే ఇటుకలు, స్టీలుతో కట్టిన కట్టడం కాదు. సుదీర్ఘకాలం పడిన కష్టానికి […]

Update: 2021-12-21 03:05 GMT

దిశ, ఏపీ బ్యూరో : ‘ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తోంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా అది సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు 31 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశాం. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా సొంతింటి కల నెరవేరుస్తున్నాం. 50 లక్షల మంది కుటుంబాలకు మంచి జరిగే రోజు ఇది. ఇల్లు అంటే ఇటుకలు, స్టీలుతో కట్టిన కట్టడం కాదు. సుదీర్ఘకాలం పడిన కష్టానికి ప్రతిరూపం ఇల్లు. గతంలో నివసించే హక్కు స్థానంలో సర్వహక్కులతో రిజిస్ట్రేషన్‌ చేయించాము. 26వేల కోట్ల రూపాయల విలువైన 31 లక్షల ఇళ్లు మంజూరు చేశాము. ఈ పథకం కింద దాదాపు రూ.10వేల కోట్ల రుణమాఫీ చేశాము. రూ.6వేల కోట్ల రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ డ్యూటీ ఛార్జీల మినహాయింపు ఇచ్చాము. 52లక్షల మందికి ఇచ్చే ఆస్తి విలువ అక్షరాలా రూ.1.58 లక్షల కోట్లు. అందరూ లబ్ది పొందాలనే ఆలోచనలో భాగంగానే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఉగాది వరకు పొడిగిస్తున్నాం’ అని సీఎం వైఎస్ జగన్‌ అన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు. అంతకు ముందు సభాప్రాంగణానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు రాష్ట్ర మంత్రులు అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం రాష్ట్ర మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, తానేటి వనిత, ఎంపీ కోటగిరి శ్రీధర్, జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఉప్పల వాసు బాబు, ముదునూరి ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ, అబ్బాయి చౌదరి, తలారి వెంకట్రావు, ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ చెల్లెం ఆనంద్ ప్రకాష్, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, డీసీఎంఎస్ చైర్మన్‌ ఇతర నేతలు సీఎం వైఎస్ జగన్‌కు స్వాగతం పలికారు.

Tags:    

Similar News