రిపబ్లిక్ డే వేడుకల్లో జగన్ సాంగ్స్
దిశ,వెబ్‌డెస్క్: నాగార్జున యూనివర్సిటీలో రిపబ్లిక్ డే సందర్బంగా సీఎం జగన్‌ను పొగుడుతున్న పాటలను యూనివర్సిటీ అధికారులు ప్లే చేశారు. పాటలకు అనుగుణంగా విద్యార్థులతో డ్యాన్సులు చేయించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాద్యమాల్లో చెక్కర్లు కొడుతోంది. ఈ తతంగం అంతా వైస్ ఛాన్స్ లర్ సమక్షంలో జరిగినట్టు వీడియోలో కనిపిస్తుండటం గమనార్హం. కాగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికారుల తీరు చూసి కార్యక్రమానికి హాజరైన అతిథులు, సీనియర్ సిటిజన్లు అవాక్కయ్యారు. దీంతో దేశ భక్తిగీతాలు ప్లే […]
దిశ,వెబ్‌డెస్క్: నాగార్జున యూనివర్సిటీలో రిపబ్లిక్ డే సందర్బంగా సీఎం జగన్‌ను పొగుడుతున్న పాటలను యూనివర్సిటీ అధికారులు ప్లే చేశారు. పాటలకు అనుగుణంగా విద్యార్థులతో డ్యాన్సులు చేయించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాద్యమాల్లో చెక్కర్లు కొడుతోంది. ఈ తతంగం అంతా వైస్ ఛాన్స్ లర్ సమక్షంలో జరిగినట్టు వీడియోలో కనిపిస్తుండటం గమనార్హం.
కాగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికారుల తీరు చూసి కార్యక్రమానికి హాజరైన అతిథులు, సీనియర్ సిటిజన్లు అవాక్కయ్యారు. దీంతో దేశ భక్తిగీతాలు ప్లే చేయాల్సిన చోట సీఎం జగన్‌ను స్తుతించే పాటలను ప్లే చేయడం ఏంటని సీనియర్ సిటీజన్‌లు, ప్రజలు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వర్సిటీ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.