పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ఏపీ సీఎం జగన్ బుధవారం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయనగరం జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, తొటపల్లి రిజర్వాయర్ పనులను కూడా వేగంగా పూర్తిచేయాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్-2 పూర్తికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం వంశధార ప్రాజెక్టు రెండోదశ పనులపై సీఎం జగన్ ఆరా తీశారు. నేరడి ప్రాజెక్టు నిర్మాణానికి తగు చర్యలు చేపట్టాలని, పొలవరం పునరావాస పనుల్లో […]

Update: 2020-08-12 09:16 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ఏపీ సీఎం జగన్ బుధవారం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయనగరం జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, తొటపల్లి రిజర్వాయర్ పనులను కూడా వేగంగా పూర్తిచేయాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్-2 పూర్తికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం వంశధార ప్రాజెక్టు రెండోదశ పనులపై సీఎం జగన్ ఆరా తీశారు. నేరడి ప్రాజెక్టు నిర్మాణానికి తగు చర్యలు చేపట్టాలని, పొలవరం పునరావాస పనుల్లో నాణ్యాతా ప్రమాణాలు పాటించాలన్నారు. అంతేకాకుండా, గండికోటలో 26.85టీఎంసీలు, చిత్రావతిలో 10టీఎంసీల నీరు నిల్వ ఉంచేలా చూడాలన్నారు. రాజోలి, జోలదిరాశి పనుల త్వరితగతిన మొదలు పెట్టాలని సీఎం ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News